కొఠియా గ్రామాల్లో..
కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో ఆంధ్రా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీ దొర్ల తాడి వలస, మూల తాడి వలస, దూలి బద్ర గ్రామాల సరిహద్దుల్లో ఉన్న కొండ ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో పార్వతీపురం సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్.వి.శేషయ్య నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. దాడుల్లో రూ.లక్ష విలువ గల 14 డ్రమ్ములలో నిల్వ ఉంచిన 2,800 లీటర్ల బెల్లం ఊట, 3 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. తయారీదారులు పరారయ్యారు.


