కొరాపుట్: క్రీడలతోనే మానసిన ఉల్లాసం సాధ్యమని జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహిణిపతి అన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి బాలుర ఫుట్ బాల్ పోటీలలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో క్రీడల్లో పాల్గొనడం ద్వారా స్నేహ సంబంధాలు మెరుగుపడడంతోపాటు క్రీడా నైపుణ్యం పెరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే పోటీలలో యువత క్రీడా స్ఫూర్తిని పాటిస్తూనే విజయాన్ని అందుకోవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంతతో కలిసి క్రీడాజ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, కొరాపుట్ మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి, క్రీడా అధికారులు పాల్గొన్నారు.


