తల్లిదండ్రులపై కొడుకు దాడి | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులపై కొడుకు దాడి

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

మల్కన్‌గిరి: తల్లిదండ్రులపై కన్నకొడుకే దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి ఉదళిబేడా పంచాయతీ బాలిగూడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సంతోష్‌ పాణిగ్రాహి అనే వ్యక్తి తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ముందుగా తల్లిను జుట్టుపట్టుకొని కొట్టడాన్ని చూసిన తండ్రి ప్రప్పుల్ల పాణిగ్రాహి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా బ్లేడుతో దాడి చేసి గొంతు, చెంపలను కోసేశాడు. ఈ సంఘటనను చూసి స్థానికులు అడ్డుకొని బాధితులను రక్షించి చికిత్స నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐసీ దీపాంజాలి ప్రధన్‌ ఆరోగ్య కేంద్రం వద్దకు చేరుకోని ప్రప్పుల్లతో మాట్లాడి వివరాలు తెలుసుకొని ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన సంతోష్‌ పాణిగ్రాహిని అరెస్టు చేశారు.

ఘన నివాళి

కొరాపుట్‌: ఉత్కళ మణి గోపబందు దాస్‌ జయంతి ఘనంగా జరిగింది. కొరాపుట్‌ జిల్లా కేంద్రంలో గోప బందు దాస్‌ విగ్రహానికి ప్రముఖులు నివాళులర్పించారు. గోప బందు ఒడిశాకి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొరాపుట్‌ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, డీసీసీ అధ్యక్షుడు రుపక్‌ తురకు, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే నిమయ్‌ సర్కార్‌, భవానీ మిశ్ర, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

వేతనాల కోసం నిరసన

టెక్కలి రూరల్‌: మండలంలోని రావివలస గ్రామంలో గల ఓస్వాల్‌ మినరల్స్‌ ఫెర్రో అల్లాయిస్‌ ఫ్యాక్టరీ వద్ద శనివారం ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలల జీతాలు చెల్లించకుండా సామగ్రిని తరలిస్తుండడంతో కార్మికులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన పోలీసులు ఇరు వర్గాల వారిని పిలిచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అ నంతరం కార్మికులకు రావాల్సిన మొత్తం జీతాలను చెల్లించాలని తెలపగా.. యాజమాన్యం నాలుగైదు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement