రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

కొరాపుట్‌: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన విషాదకర ఘటన జరిగింది. శుక్రవారం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని ఇచ్చావతి గుడ కి చెందిన సుశాంత్‌ పాణీగ్రాహీ (55), అతని భార్య మీనాక్షి పాణీ గ్రాహీ (50) ఉమ్మర్‌కోట్‌ పట్టణం నుంచి నబరంగ్‌పూర్‌ కి తమ కారులో బయల్దేరారు. డాబుగాం సమీపంలో దమనాగుడ వద్ద కారు అదుపు తప్పి చెట్టుని ఢీ కొంది. ఘటనా స్థలంలోనే భార్యాభర్తలు మృతి చంఎదారు. కారును సుశాంత్‌ నడుపుతున్నాడు. మితిమీరిన వేగం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిసింది. డాబుగాం అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి డాబుగాం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement