● అంగన్వాడీ కార్యకర్తల తీరుపై ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం
రాయగడ: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహార పంపిణీ, విద్యా బోధన, ఇతర సౌకర్యాల నిర్వహణలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అనంతరం సమూహంగా చేరి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రాయగడ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రెస్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (ఐసిడిఎస్) కు ఉద్దేశించిన వినతిపత్రాన్ని సూపర్వైజర్ సుబుధ్ది సబర్కు అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం అందజేశారు. ఒక ఒడియా దినపత్రిక జిల్లా ప్రతినిధి విజయ్ కుమార్ మహారాణ అక్టోబర్ 3న సదరు సమితి పరిధిలో గల బైరాగి హాలువ పంచాయతీలోని గురురాజగుడ అంగన్వాడీ కేంద్రానికి వార్త సేకరణ కోసం వెళ్లగా.. అంగన్వాడీ కార్యకర్త ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాతి రోజు కూడా బెదిరింపులు వచ్చాయి. దీనిపై విచారణ జరపాలని పాత్రికేయులు కోరారు.


