ఒడిశా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్‌తో సీఎం చర్చలు | - | Sakshi
Sakshi News home page

ఒడిశా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్‌తో సీఎం చర్చలు

Oct 10 2026 12:40 AM | Updated on Oct 10 2026 12:40 AM

భువనేశ్వర్‌: ఒడిశా అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి చర్చించారు. శుక్రవారం భువనేశ్వర్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, భవిష్యత్‌లో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రగతిని మరింత వేగవంతం చేయడంతోపాటు, సంక్షేమ పథకాల అమలును సమర్థంగా ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం అనుసరించనున్న అభివృద్ధి ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చలు జరిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement