పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌కు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌కు అస్వస్థత

Sep 27 2026 1:22 AM | Updated on Sep 27 2026 1:22 AM

భువనేశ్వర్‌: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా కోరుతూ కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన ప్రదర్శనకు సారథ్యం వహించిన ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే ఆయనను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ భక్త చరణ్‌ దాస్‌ సారథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ శనివారం భారీ ఆందోళన చేపట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ఎన్నికల సంఘంలో అసంతృప్తి నెలకొందని కలకలం రేపిన వార్తా ప్రసారంతో కాంగ్రెసు పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో ఓపీసీసీ నిరసన చేపట్టింది. పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శిస్తూ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయం నుంచి సీఈవో కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. గత 8 రోజులుగా జ్వర సంబంధిత అనారోగ్యంతో మందులు తీసుకుంటున్న భక్త చరణ్‌ దాస్‌ పలు పార్టీ కార్యక్రమాల్లో నిర్విరామంగా తలమునకలు కావడంతో వైద్య పరీక్షలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఆక్సిజన్‌ స్థాయి కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితుల్లో వారం రోజుల పాటు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరి పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement