రాయగడ: సమాజ సేవ, అంకితభావం, పరిశుభ్రత, సానుభూతి, పౌర బాధ్యతలను చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్రనాథ్ కహార్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో భవిష్యత్ పౌరులుగా విద్యార్థులు తమ గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాస్థాయి వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. స్థానిక పీఎంశ్రీ గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అభివృద్ధి మండలి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, హెచ్‌ఎం నమితా ప్రధాన్, అధ్యాపకులు శక్తికుమార్ బెహర తదితరులు పాల్గొన్నారు.


