కొరాపుట్: భారీ వర్షాల నేపథ్యంలో నబరంగ్‌పూర్ జిల్లాలో అత్యవసర పరిస్థితులుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజులు పాఠశాలలకు ప్రకటించారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. 24, 25 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని కలెక్టర్ ప్రకటించారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, బీడీవోలు, తహసీల్దార్లు యథావిధిగా కార్యాలయాలకు హాజరు కావాలన్నారు. సమితి కేంద్రాలలో ఆహార నిల్వలు ఉంచాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నదులు, రిజర్వాయర్లలో చేపల వేటను నిషేధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు.


