యంత్రాంగం అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

యంత్రాంగం అప్రమత్తం

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

యంత్రాంగం అప్రమత్తం

రాయగడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విపత్తు నిర్వహణపై సన్నద్ధత సమావేశం నిర్వహించారు. తహసీల్దార్‌లు, బీడీఓలు, మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సున్నితమైన, ప్రమాదకర ప్రాంతాలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలను ఇప్పటికే సెలవులు ప్రకటించామన్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రతీకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో నదుల్లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం చేయవద్దన్నారు. జలవనరుల శాఖ అధికారులు నదుల నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షించి ప్రమాద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటే జిల్లా అత్యవసర నిర్వహణ కేంద్రానికి సమాచారం అందించాలని ఆదేశించారు. విద్యుత్‌ భద్రత, అత్యవసర సేవలను నిరంతరాయంగా అందించేందుకు టిపిఎస్‌ఒడిఎల్‌ చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement