రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌లో గల అభ్యాస్ టెక్నొస్కూల్‌లో బుధవారం ఫయిస్తా పేరిట కొత్త విద్యార్థులకు స్వాగతం పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ కార్యదర్శి లాడి తుకారాం మాట్లాడుతూ నాణ్యతమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాంతంలో పాఠశాలను ప్రారంభించామన్నారు. జిల్లాలో అత్యధిక శాతం ఆదివాసీ, హరిజనలు నివసించే ప్రాంతం కావడంతో వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ.. ఈ పాఠశాలలో విద్యా బోధన కొనసాగిస్తున్నామన్నారు. ముఖ్యంగా ర్యాగింగ్ రహిత పాఠశాలగా గుర్తింపుపొందడం ఎంతో శుభపరిణామమన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ దివ్య దేవశీష్ దుబే మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థులకు విద్యాభ్యాసం కొనసాగించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఆసక్తితో ఇక్కడ చదువుకుంటున్నారని తెలిపారు. విద్యర్థులు వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


