రాయగడ: స్థానిక న్యూకాలనీలో అక్టోబరు 25వ తేదీ నుంచి పన్నెండు రోజుల పాటుగా జరగనున్న మా గజలక్షీ పూజలకు సంబంధించి బుధవారం ముహూర్తపు రాట క్యాక్రమాన్ని నిర్వహించారు.31 సంవత్సరాలుగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ గజలక్ష్మీ పూజలను ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. లులు సామంతరాయ్ ముహూర్తపు రాటలో పాల్గొన్నారు. ప్రభారీ మహారాజ్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గజలక్ష్మీ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా పూజా కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా న్యాయవాది సంతోష్ కుమార్ పాత్రో, కార్యదర్శిగా ఎన్.త్రినాథరావు,ఉపాధ్యక్షుడిగా వినోద్ సాహు, సహాకార్యదర్శిగా సంతోష్ కుమార్, సలహాదారులుగా సవ్యసాచి సాహు, రామ్ ప్రసాద్ పాత్రో, కోశాధికారిగా దిలీప్ సాహు నియమితులయ్యారు.


