రాయగడ: హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలని స్థానిక మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ అన్నారు. కళాశాల రెడ్ రిబన్ క్లబ్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన హెచ్‌ఐవీ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. యువతకు హెచ్‌ఐవీపై కచ్చితమైన సమాచారం అందించడం, బాధ్యతాయుతమైన వైఖరిని పెంపొదించడం ద్వారా సమాజంలో ఆపోహాలను తొలగించవచ్చన్నారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష చూపవద్దన్నారు. యువ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ సెక్రటరీ టికేశ్వర్ మాఝి తదితరులు పాల్గొన్నారు.


