శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026

Jul 24 2026 2:21 AM | Updated on Jul 24 2026 2:21 AM

నీల చక్రం

న్యూస్‌రీల్‌

శ్రీమందిరం ఆదాయం లెక్కింపు

నగదు : రూ.2,79,270

భువనేశ్వర్‌: శ్రీ జగన్నాథ ఆలయ పవిత్ర సంప్రదాయాలు, వారసత్వాన్ని పరిరక్షించడంలో ఆలయ పరిపాలన విభాగం మరో మైలు రాయిని ఆవిష్కరించింది. స్వామి సంస్కృతితో ముడిపడి దైనందిన వ్యవహారంలో కొనసాగుతున్న ప్రముఖ నామాలు (పేర్లు) పవిత్రత పరిరక్షణకు ప్రత్యేక గుర్తింపు సాధించింది. ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రీ రెండో విడత పరిశీలన అనంతరం రాబోయే ట్రేడ్‌మార్క్‌ జర్నల్‌లో ప్రచురణ కోసం 5 ట్రేడ్‌మార్క్‌ దరఖాస్తులకు ఆమోదం లభించిందని ప్రధాన నిర్వాహకుడు డాక్టరు అరవింద కుమార్‌ పాఢి తెలిపారు. ఆ జాబితాలో జగన్నాథ ధామ్‌, శ్రీ క్షేత్రం, మహా ప్రసాదం, నీల చక్రం, కోయిలి వైకుంఠం చోటు చేసుకున్నాయి. శ్రీ జగన్నాథునితో ముడిపడి ఉన్న పవిత్ర నామాలు, సంప్రదాయాలను పరిరక్షించడం, వాటి అనధికారిక వినియోగం, వాణిజ్య దుర్వినియోగాన్ని నివారించడం దిశగా ఈ ఆమోదాలు దోహదపడతాయని తెలిపారు.

శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీ మందిరం శిఖరాన నింగికి చేరువై స్థాయిలో నీల చక్రం దర్శనం ఇస్తుంది. నీల చక్రం అష్ట ధాతువులతో తయారైనదిగా పేర్కొంటారు. తరతరాలుగా ఈ చక్రం ప్రకృతి వైపరీత్యాల్ని ఎదురీదుతు నిత్య నూతనంగా ఆలయ శిఖరాన నెలకొని ఉండడం విశేషం. ఆలయ శిఖరాన మహిమాన్విత చక్రంగా భక్తజనుల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించిన నీల చక్రం తాజాగా ట్రేడ్‌ మార్కు రిజిస్ట్రీలో చోటు చేసుకుని ఉనికిని మరింత పటిష్టపరచుకుంది.

కోయిలి వైకుంఠం

శ్రీ మందిరం సముదాయంలో ఇదో పవిత్ర ప్రాంగణం. ప్రధాన దేవస్థానానికి వెనుక వైపు నెలకొని ఉంది. ఈ ప్రాంగణం మూల విరాటుల నవ కళేబర మహోత్సవంతో ముడి పడి ఉండడం విశేషం. ఆలయ సంప్రదాయం, ఆచార వ్యవహారాల నేపథ్యంలో ప్రత్యేక పంచాంగం గణాంకాల ప్రకారం రత్న వేదికపై మూల విరాటులను మార్చుతుంటారు. వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తారు. ఇదో బృహత్తర ప్రక్రియ. కొత్త మూర్తుల తయారీ, బ్రహ్మాండ ప్రదానం, పాత మూర్తుల ఖననం ఈ ప్రాంగణంలోనే జరగడంతో దీనిని కోవెల వైకుంఠంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర క్షేత్రానికి ట్రేడ్‌ మార్కు కేటాయించడం గౌరవప్రదంగా నిలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement