గజపతి రాజ ప్రాసాదం సందర్శన | - | Sakshi
Sakshi News home page

గజపతి రాజ ప్రాసాదం సందర్శన

Jul 24 2026 2:21 AM | Updated on Jul 24 2026 2:21 AM

పర్లాకిమిడి: రాష్ట్ర ఖనిజ, రవాణా శాఖమంత్రి బిభూతీ భూషణ్‌ జెన్నా ఒకరోజు గజపతి జిల్లా పర్యటనకు విచ్చేసి శ్రీజగన్నాథ మందిరంలో జరుగుతున్న పునర్నిర్మాన పనులు, గుండిచా మందిరంలో శ్రీజగన్నాథుడు కల్కి అవతారాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట బిజేపీ సీనియర్‌ నాయకులు ఛిత్రి సింహాద్రి, బిజేపీ నాయకులు సిధ్ధేశ్వర మిశ్రా, రాయఘడ బ్లాక్‌ మాజీ చైర్మన్‌ అంతర్యామి గోమంగో, ముల్లి గోపాలరావు తదితరులు ఉన్నారు. తొలుత రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా రాజవీధిలో జగన్నాథ మందిరం వద్ద అన్నప్రసాదాలను స్వయంగా పంపిణీచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పంపిణీలో వీహెచ్‌పీ, భజరంగ దళ్‌ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జగన్నాథ మందిరం పునర్నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. తరువాత మంత్రి జెన్నా, గజపతి ప్యాలెస్‌కు వెళ్ళి గజపతి రాజుల చివరి వంశీయురాలు కల్యాణీ గజపతిని కలిసి మట్లాడారు. ఈ సందర్భంగా రాజావారి ప్యాలస్‌ మరమ్మత్తుకు గాను యువరాణి కళ్యాణీ గజపతి రాష్ట్ర మంత్రి జెన్నాకు వినతిని అందజేశారు. గజపతి రాజవంశీయుల కోట విశేషాలను పూర్ణచంద్ర మహాపాత్రో ద్వారా తెలుసుకున్నారు. అప్పట్లో ఇంగ్లాడు నుంచి వచ్చిన బ్రిటీషు ఆర్కిటెక్ట్‌ రాబర్టు ఫెల్లోయిస్‌ ఛిస్లోమ్‌ పర్లాకిమిడి, కంచిలి వద్ద తర్లా కోట, చైన్నెలో కృష్ణచంద్రగజపతి మార్గ్‌లో ఉన్న రాజవారి కోట ఒకేసారి నిర్మాణం అయ్యిందని పూర్ణమహాపాత్రో తెలియజేశారు.

రాజావారి దర్బారు సీలింగు, దర్బారు ముందుభాగం ప్రస్తుతం పడిపోయి జీర్ణావస్థలో ఉందని, దీనికి సుమారు రూ.3 కోట్ల ఖర్చువుతుందని, అయితే గజపతి మహారాజుల కోట ఒడిషా రాష్ట్ర ప్రజలకే తలమాణికమని, అలాంటి ప్రాచీన జాతీయ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని అన్నారు.

యువరాణితో ప్రత్యేక సమావేశం

రాజదర్బారులో మంత్రి బిభూతీ జెన్నా సమావేశం అనంతరం యువరాణి కళ్యాణీ దేవితో కోటలో సమావేశమయ్యారు. ఆయన వెంట బిజేపీ నాయకులు, సిధ్ధేశ్వర మిశ్రా, పూర్ణమహాపాత్రో వున్నారు. ఆమెను బీజేపీ పార్టీలోకి రాష్ట్ర మంత్రి బిభూతి జెన్నా ఆహ్వానించినట్టు అబిజ్ఞాన వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement