శ్రీ క్షేత్రం
●
శ్రీ జగన్నాథుని
పవిత్ర నామాలకు
పవిత్ర చతుర్థామ క్షేత్రాల్లో ఒకటిగా వాసికి ఎక్కిన శ్రీ జగన్నాథుని ప్రధాన దేవస్థానం జగన్నాథ ధామంగా ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో స్థానం సొంతం చేసుకుంది. ఈ పవిత్ర నామాన్ని ఇతర ప్రాంతాల్లో మరి ఏ ఇతర శ్రీ జగన్నాథ ఆలయానికి జోడించేందుకు వీలు లేని రీతిలో జగన్నాథ ధామ్ ట్రేడ్ మార్కు కవచంలా పరిరక్షిస్తుంది.
రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, జగతి నాథుడు కొలువై ఉన్న పూరీ పట్టణం ఆధ్యాత్మిక కోణంలో పలు నామాలతో పేర్కొనబడుతుంది. వాటిలో శ్రీ క్షేత్రం అత్యంత వాడుకలో కొనసాగుతున్న పవిత్ర నామం. ఈ నామానికి ట్రేడ్ మార్కుతో ప్రత్యేక ఉనికి సాధ్యమైంది.


