వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన మంగళవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 వినతులు అందాయి. ఇందులో 26 గ్రామ సమస్యలుగా గుర్తించారు. మిగతా వినతుల్లో భాగంగా ముగ్గురుకి రూ.36 వేల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేశారు. మరొకరికి రెడ్ క్రాస్ నుంచి రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. గ్రామ సమస్యలను త్వరితగతిన పరివేక్షించి మౌలిక సౌకర్యాలను కల్పించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి లక్షయ కుమార్ ఖెముండొ, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ సరోజినిదేవి, తదితర విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మోటులో గ్రీవెన్స్..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు తహసీల్దార్ పరిధిలో గల పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా కలెలేక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ హాజరై గిరిజనుల అందజేసిన వినతులను స్వీకరించారు. ఇందులో పలు సమస్యలను పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పైఅధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. మోటులో ప్రాథమిక, ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, కలిమెల సమితిలో ఉన్న ప్రఽభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
వినతుల స్వీకరణ


