ఎస్పీ దృష్టికి సమస్యలు
రాయగడ: అమో పోలీస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌కు మున్సిపాలిటీ పరిధిలో గల 20వ వార్డు సాయిలక్ష్మీ కాలనీ వాసులు మంగళవారం సమస్యలను విన్నవించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ, ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, పోలీస్ అధికారి మున్ని ఆచారి, 20వ వార్డు కౌన్సిలర్ ఎం.మంగమ్మ హాజరయ్యారు. అధికారులకు కాలనీ వాసులు తమ సమస్యలు వివరించారు. కొత్తగా ఆవిర్భవించిన ఈ ప్రాంతంలో గత కొన్నాళ్లగా ఇళ్ల సంఖ్య పెరడంతోపాటు జనాభాపరంగా కూడా అభివృద్ధి చెందిందని వివరించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి కానరావడం లేదని తెలియజేశారు. ముఖ్యంగా రహదారులు లేక కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తమ ప్రాంతంలో సీసీ కెమెరాలతోపాటు పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయాలని కోరారు.


