సీసీ కెమెరాల ప్రారంభం
పర్లాకిమిడి: పట్టణంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణకు సీసీ కెమెరాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదర్శ పోలీసు స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. పర్లాకిమిడి పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సమావేశానికి జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, జిల్లా పరిషత్ అదనపు ప్రాజెక్టు అధికారి పృథ్వీరాజ్ మండల్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసీ ప్రశాంత్ భూపతి తదితరులు హాజరయ్యారు. పట్టణంలో 12 స్థానాల్లో 26 కెమెరాలు అమర్చామని, దీనిని రెట్టింపు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలో సీసీ కెమెరాల వల్ల చోరీలు, ట్రాఫిక్ అంతరాయాన్ని అరికట్టగలమన్న ఆశాభావాన్ని జిల్లా ఎస్పీ పండా వ్యక్తం చేశారు. అనంతరం ఆదర్శ పోలీసు స్టేషన్‌లో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను ఎమ్మెల్యే, ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ములమ్మ, నారాయణరావు, బబులా బెహరా, బాలకృష్ణ పాత్రో తదితరులు పాల్గొన్నారు.


