మద్యం మత్తులో యువకుడి వీరంగం
పలాస: పలాస కేటీరోడ్డు ఇందిరా చౌక్ వద్ద మంగళవారం మద్యం మత్తులో ఒక యువకుడు తన చేయి కోసుకొని వీరంగం సృష్టించాడు. ప్రశ్నించిన వాహనదారులపై దాడికి ప్రయత్నించాడు. తన చేతిని విరిగిన గాజు సీసాతో కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలి గింది. అనంతరం అక్కడ నుంచి ఆ యువకుడు మెల్లగా జారుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదిఏమైనా జంట పట్టణాల్లో యువకులు మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు.


