నేటి నుంచి నిద్దాలమ్మ జాతర
జి.సిగడాం: మండలం పరిధిలో నిద్దాం గ్రామంలో వెలిసిన నిద్దాలమ్మ తల్లి 19వ యాత్ర మహోత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభమై, వచ్చే నెల 1 వ తేదీ వరకు జరుగుతాయని గ్రామ, ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించి గ్రామస్తుంతా ఒకేసారి ముర్రాటలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఉదయం, సాయంత్రం కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించనున్నామని కమిటీ సభ్యులు తెలి పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక వసతులు ఏర్పాటుచేశామని తెలిపారు.
సీఐటీయూ నాయకుడు
కృష్ణారావు మృతి
ఆమదాలవలస/రూరల్: సీఐటీయూ సీనియర్ నాయకుడు, షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ ఉద్యమకారుడు కామ్రేడ్ పంచాది కృష్ణారావు (67) మండలంలో కనుగులవలస గ్రామంలోని తన స్వగృహంలో మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారులు చైతన్య, వెంకటేష్ ఉన్నారు. కామ్రేడ్ కృష్ణారావు మృతి కార్మిక ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతిపై సీఐటీయూతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. కామ్రేడ్ పంచాది కృష్ణారావు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తూ.. దివంగత నేత కామ్రేడ్ మెట్ట కొండయ్యతో కలిసి సుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్‌లో చురుకుగా వ్యవహరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన ఆయన జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా ఆమదాలవలస ప్రాంతంలో అనేక కార్మిక సంఘాలను సంఘటితం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో పాటు మున్సిపల్, రైల్వే, స్టీమ్ వర్కర్ల సమస్యలపై పోరాటాలకు నాయకత్వం వహించి అనేక ఉద్యమాలను నడిపారు. నిర్వాసితుల పోరాటాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన అరైస్టె పలు కేసులను ఎదుర్కొనగా, ఇటీవల కాలంలో ఆ కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. కామ్రేడ్ కృష్ణారావు అంత్యక్రియలు బుధవారం ఉదయం 8 గంటలకు వారి స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, సీఐటీయూ నాయకులు తెలిపారు.
సౌత్ జోన్ క్రికెట్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థి
నరసన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న కోట ఢిల్లీశ్వరరావు ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించే సౌత్‌జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.లత తెలిపారు. మైసూర్‌లో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలు 27 వ తేదీ నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకూ జరగనున్నాయని తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ తరఫున ఢిల్లీశ్వరరావు ఎంపికయ్యారని వివరించారు. ఈమేరకు పీడీ కె.బోగేశ్వరరావు విద్యార్థికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
సైబర్ క్రైమ్ కేసులో ఒకరు అరెస్టు
పాతపట్నం: స్థానిక రత్నాలపేటకు చెందిన ఎస్‌బీఐ సేవా కేంద్రం, మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు టంకాల శివకుమార్‌ను సైబర్ క్రైమ్ కింద హర్యానా పోలీసులు అరెస్టు చేసినట్లు పాతపట్నం ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌కు చెందిన గంగకాంత్ చౌదరి బ్యాంక్ ఖాతా నుంచి రూ.48 లక్షలు పాతపట్నం రత్నాలపేట శివకుమార్‌కు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. శివకుమార్ తనకు కాల్ చేసి ఎన్‌ఐఏ అధికారిగా పరిచయం చేసుకుంటూ.. డబ్బులు తన బ్యాంక్ ఖాతాలో జమ చేయకపోతే అరెస్ట్ చేస్తామని భయపెట్టినట్లు బాధితుడు గంగకాంత్ చౌదరి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు వచ్చి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నరసన్నపేట: స్థానిక పాత స్టేట్ బ్యాంకు వీధికి చెందిన శాంతామణి రైస్ ఇండస్ట్రీస్ యజమాని ఊణ్ణ వెంకటరమణమూర్తి(67) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖపట్నంలోని మద్దెలపాలెం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటరమణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. వైద్య పరీక్షల కోసం నరసన్నపేట నుంచి విశాఖపట్నం సోమవారం వెళ్లారు.
రాత్రి తన కుమార్తె మౌనిక ఇంటి వద్ద ఉన్నారు. ఉదయం మార్కెట్‌కు కూరగాయలు కొనేందుకు స్కూటీపై వెళ్తుండగా విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందారు. ఆయన నరసన్నపేటలో మిల్లర్‌గా మంచి గుర్తింపు పొందారు. ఈయన కుమారుడు భార్గవ్ నరసన్నపేట మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
అమ్మవారి నిజరూపం
నేటి నుంచి నిద్దాలమ్మ జాతర
నేటి నుంచి నిద్దాలమ్మ జాతర


