పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జయపురం: స్థానిక సరస్వతీ విద్యామందిర్ శారదా విహార్‌లో 2006లో మెట్రిక్ చదివి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జయపురం సమితి టంకువ గ్రామంలో శనివారం జరిగింది. సరస్వతీ శిశుమందిర ప్రధాన ఆచార్యులు లక్ష్మీకాంత మిశ్రా ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పూర్వ విద్యార్థుల కలయిక అభినందనీయమన్నారు. ఇలాంటి కలయికలు సంప్రదాయంగా మారాలన్నారు. విద్యామందిర్ విశ్రాంత ఆచార్యులు సునీల్ కుమార్ శతపతి మాట్లాడుతూ.. పూర్వవిద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడ చదివిన వారంతా మంచి నడవిడిక కలిగి ఉన్నతులుగా ఎదగటం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకను ఆప్యాయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. సందీప్ పండ ప్యవేక్షణలో సమీర్ సాహు, సౌమ్యరంజన్ పట్నాయక్, శివ గౌఢ, ఆహ్వాణద్వీప్ స్వైన్, వివేక్ సింగ్, సిద్ధార్థ పాఢీ, అనిరుద్ద పండ, సుమన్ పాత్రో, విశ్వేశ్వర పాత్రో, చిత్తరంజన్, సుశాంత బెహర, అతీష్ సాబత్, అవినాశ్ మహాపాత్రో పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


