ఒడిశా రాష్ట్ర విద్యుత్ సంస్థ ఇంజినీర్ల సమావేశం
రాయగడ: రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ల సమస్యలను ప్రభుత్వం, అదేవిధంగా టాటా పవర్ మేనేజ్‌మెంట్ పరిష్కరించాలని, లేకుంటే రానున్న రోజుల్లో తామంతా ఆందోళన బాటపడతామని ఇంజినీర్లు హెచ్చరించారు. ఆదివారం నాడు ఈ మేరకు ఒక హోటల్‌లో జరిగిన ఇంజినీర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆ సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆనంద్ మహాపాత్రో మాట్లాడుతూ టాటా పవర్ మేనేజ్‌మెంట్ తమ వైఖరిని మార్చుకోవాలని కోరారు. అదేవిధంగా ఎప్పటి నుంచో మూలుగుతున్న సామూహిక సమస్యలను పరిష్కరించే దిశగా ఏ మాత్రం కృషి చేయని యాజమాన్యం తీరుపై మండి పడ్డారు. జూనియర్, అసిస్టెంట్ ఇంజినీర్ల కొసం ప్రభుత్వం ప్రకటించిన నిష్పత్తి ప్రకారం కేడర్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా మాజీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలొ టీపీఏస్‌ఓడీఎల్ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ రస్మీరంజన్ ఆచార్య, సరొజ్ మిశ్రా, సీనియర్ సభ్యులు నారాయన్ నాయక్, సుధీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
31 ఎకరాల్లో గంజాయి
పంట ధ్వంసం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి కుడుగుడ, ఖొమాబెడ గ్రామాల పరిసర ప్రాంతాల్లో గ్రీన్ క్లీన్ ఆపరేషన్ అభిజాన్‌లో భాగంగా.. అక్రమంగా పండిస్తున్న 31 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను తగులబెట్టినట్టు బొయిపరిగుడ అబ్కారి స్టేషన్ ఇన్‌చార్జి అజయకుమార్ నాయిక్ వెల్లడించారు. అబ్కారీ, పోలీసులు విభాగాల అధికారులు సిబ్బంది కలసి నిర్వహించిన గ్రీన్ క్లీన్ అభిజాన్‌లో అజయ కుమార్ నాయిక్‌తో పాటు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ ధీరేంద్ర బారిక్ నేతృత్వంలో శనివారం బొయిపరిగుడ సమితి కుడుగుడ, ఖొమాబెడ గ్రామ ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్న పొలాలపై దాడులు జరిపి 31 ఎకరాలలో పండిస్తున్న గంజాయిని ధ్వంసం చేసి తగుల బెట్టారు. 31 ఎకరాల్లో పండించిన 37 వేల రెండు వందల గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు అబకారి అధికారి అజయ కుమార్ నాయిక్ వెల్లడించారు. దీని విలువ రూ.3.72 కోట్లు ఉంటుందని తెలిపారు.
చంద్రగిరికి లైఫ్ సైన్స్ విద్యార్థులు
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల పోస్టు గ్రాడ్యుయేషన్ (లైఫ్ సైన్సు) విద్యార్థులు ఆదివారం స్టడీ టూర్ నిమిత్తం చంద్రగిరి వద్ద ఖసడా జలపాతాల వద్దకు వెళ్లారు. చంద్రగిరి వద్ద పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్)పై అవగాహన కల్పిస్తామని అధ్యాపకులు తెలిపారు. మొత్తం 55 మంది విద్యార్థులు టూర్‌లో పాల్గొన్నారు.
రూర్కెలా విమానం కూలిన ప్రమాదంలో ఒకరి మృతి
భువనేశ్వర్: రూర్కెలాలో ఈ నెల 10న జరిగిన విమాన ప్రమాదంలో గాయపడిన ఆరుగురు వ్యక్తులలో ఒకరు శనివారం చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం తర్వాత ఉన్నత చికిత్స కోసం అతడిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. మృతుడిని సుశాంత బిస్వాల్‌గా గుర్తించారు. ఈ నెల 10వ తేదీన జల్దా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 6 మంది గాయపడిన విషయం తెలిసిందే.
ట్రక్ ఢీకొని కారు డ్రైవర్ మృతి
భువనేశ్వర్: స్థానిక వాణీ విహార్ ఓవర్ బ్రిడ్జిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ట్రక్కు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు స్థానిక బ్రిట్ కాలనీ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఒడిశా రాష్ట్ర విద్యుత్ సంస్థ ఇంజినీర్ల సమావేశం
ఒడిశా రాష్ట్ర విద్యుత్ సంస్థ ఇంజినీర్ల సమావేశం


