గజపతి ఉత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: గజపతి ఉత్సవాలు ఆదివారం నుంచి గజపతి స్టేడియంలో ప్రారంభం కానున్న దృష్ట్యా స్థానిక శ్రీజగన్నాథ మందిరం వద్ద నుంచి గజపతి ఉత్సవాల జ్యోతిని పట్టుకుని అధికారులు పట్టణంలో పలు కూడళ్లలో జ్యోతి శోభాయాత్ర ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పర్లాకిమిడి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ శోభాయాత్రలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మునీంద్ర హానగ, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, జిల్లా సమాచార శాఖ అధికారి ప్రదిప్త గురుమయి, బసంత పండా, బాసుదేవ్ దాస్, తదితరులు పాల్గొన్నారు. రాజవీధి నుంచి మార్కెట్ మీదుగా గజపతి స్టేడియంకు జ్యోతిని ఊరేగించి స్టేడియం వద్ద ప్రధాన వేదిక వద్ద ఉంచారు. ఈ గజపతి ఉత్సవాలు, పల్లెశ్రీ ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. గజపతి ఉత్సవాలను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో కలిసి గజపతి స్టేడియంలో ప్రారంభించారు. అనంతరం శ్రీకృష్ణచంద్రగజపతి నారాయణ్ దేవ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్టేడియంలో వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్, మహిళా స్వయం సహాయక గ్రూపుల స్టాల్స్, పల్లెశ్రీ మేళాను కూడా మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ప్రారంభించారు.
గజపతి ఉత్సవాలు ప్రారంభం
గజపతి ఉత్సవాలు ప్రారంభం
గజపతి ఉత్సవాలు ప్రారంభం
గజపతి ఉత్సవాలు ప్రారంభం


