శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి రాఖల్‌గూఢ, మరరివాడ, నీలిగూఢ, ఎంవీ 18 గ్రామాల వాసులతో మంగళవారం కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్, ఎస్పీ వినోద్ పటేల్‌లు శాంతి చర్చలు జరిపారు. భవిష్యత్ కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. నాలుగు గ్రామాల ప్రజలు శాంతి భధ్రతలకు సంబంధించి సమస్యల గురించి నేరుగా ఎస్పీకి చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించవద్దని ఎస్పీ కోరారు. నకిలీ వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ప్రాథమిక సమస్యలు విన్నారు. గిరిజనుల ఇళ్ల పట్టాలను త్వరగా జారీ చేయాలని కలెక్టర్ తహసీల్దార్‌కు ఆదేశించారు. నీలిగూడ గ్రామంలో చదువు మానేసిన ఒక విద్యార్థి గురించి కలెక్టర్‌కు తెలియడంతో ఆమెను హాస్టల్‌లో చేర్పించాలని ఆదేశించారు.
శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు
శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు
శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు
శాంతి భద్రతలపై ప్రజలతో చర్చలు


