మహిళల విజయాలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

మహిళల విజయాలు స్ఫూర్తిదాయకం

Mar 10 2026 7:15 AM | Updated on Mar 10 2026 7:15 AM

మహిళల విజయాలు స్ఫూర్తిదాయకం

జయపురం: నేటి సమాజంలో మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకమన్నారు. కొరాపుట్‌ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌ మహంతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. మహిళలు సాధిస్తున్న విజయాలతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటం ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతు న్న వివక్ష, హింస, అసమానతలు వంటి సమస్యల ను వివరించారు. పలు చట్టాలపై అవగాహన కల్పి ంచాలన్నారు. ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి నిషిత్‌ నిశాంక్‌,చీఫ్‌ జ్యడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎస్‌.శుభలక్ష్మి, సీనియర్‌ డివిజన్‌ సివిల్‌ జడ్జి, ఉమెన్స్‌ కోర్టు జడ్జ్‌, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం కార్యదర్శి అలకానంద మహంతి, సివిల్‌ కోర్టు రిజస్ట్రార్‌ విష్ణప్రసాద్‌ దేవత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement