పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామముఖి పరిపాలన, సంయుక్త గ్రీవెన్స్‌సెల్‌కు మంచి స్పంద న లభించింది. గుమ్మ బ్లాక్‌లో సెరంగో, అజయగ డ, గుమ్మ గ్రామాల నుంచి 86 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో వ్యక్తిగతం 56, గ్రామ సమస్యలకు సంబంధించినవి 30 ఉన్నాయి. గ్రీవెన్స్‌లో ఇద్దరు దివ్యాంగులకు రాష్ట్ర కార్మిక, ఉపా ధి విభాగం ద్వారా వివాహ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం కింద రూ. 2.50 లక్షల చెక్కులను ఏడీఎం మునీంద్ర హానగ అందజేశారు. అలాగే 30 మంది గిరిజనులకు జంగిల్, జమ్మి పట్టాలు ఆర్వో ఆర్‌లను ఆదనపు మేజిస్ట్రట్ పంపిణీ చేశారు. వినతులన్నీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఏడీఎం మునీంద్ర హానగ అధికారులను ఆదేశించా రు. గుమ్మ సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, బీడీవో దులారాం మరాండి, ఇన్‌చార్జి సీడీఎంవో డాక్టర్ రబినారాయణ దాస్ పాల్గొన్నారు.


