30 కేజీల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పోలీసులు 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిమిలిగుడ – పొట్టంగిల మధ్య జాతీయ రహదారి–26పై విడా ఆఫీస్ సమీపంలో లైట్‌హౌస్ చర్చి వద్ద అనుమానాస్పదంగా ఒక వ్యక్తి సంచరించడం పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా, అతని బ్యాగులో 30 కేజీల గంజాయి పట్టుబడింది. నిందితుడు గంజాం జిల్లా బైద్యనాథ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జయదుర్గానగర్‌కి చెందిన రాహుల్ కుమార్ బుయ్యాన్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఈ కేసుని ఎస్‌ఐ బాబాజీ చరణ్ కన్వర్ దర్యాప్తు చేస్తున్నారు.


