అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పర్లాకిమిడి: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మఝి మంగళవారం వర్చువల్‌గా పలు అభివృద్ధి పథకాలకు, ఎనిమిది రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పర్లాకిమిడి వాసుల చిరకాల కోరిక బైపాస్ రోడ్డును రూ.48.6 కోట్లతో పాటు మొత్తం రూ.226.58 లక్షలను ఎనిమిది రోడ్డు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
కొత్త రోడ్డు ప్రాజెక్టులలో మోహనా నియోజకవర్గంలో జిరంగో, కోయిపూర్ రోడ్డు, గుసాని సమితిలో గొప్పిలి–కించిలింగి (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు), సెరంగో–నువాగడ, బాగుసల– అగర్‌ఖండి, చాందిపుట్– లుహాగుడి ఉన్నాయి. పర్లాకిమిడి, మోహనా ఎమ్మెల్యేలు రూపేష్ పాణిగ్రాహి, దాశరథి గొమాంగో విచ్చేసి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఏడీఎం మునీంద్ర హానగ, రోడ్లు–భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు అభిషేక్ శెట్టి, మోహనా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శెఠి, అదనపు ఎస్పీ పునీల్‌కుమార్ మహంతి తదితరులు పాల్గొన్నారు.


