భూగర్భ జలాలను కాపాడుకుందాం
రాయగడ: నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బిజు పట్నాయక్ కళ్యాణ మండపంలో మంగళవారం పాణి పంచాయతీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతరించిపోతున్న భూగర్భజలాలను సంరక్షించుకోవాలని, నీటి వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులు సాగునీటి వనరుల వినియోగంలో సరైన మెలకువలు పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌కే హేసాన్ మాట్లాడుతూ ప్రభుత్వం సమకూరుస్తున్న సాగునీటి ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన నిర్వహణ లేకే సాగునీటి వనరులు నిరుపయోగమవుతున్నాయని చెప్పారు.


