పర్లాకిమిడిలో ‘పోలాకి’ సందడి
పర్లాకిమిడి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన పర్లాకిమిడి వాసి పోలాకి విజయ్‌ను చిరంజీవి అభిమాన సంఘం నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలో జయా మహాల్‌లో రిలీజైన ఈ సినిమాను వీక్షించేందుకు మంళవారం విజయ్ వచ్చారు. ఈ సందర్భంగా విజయ్‌ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. సినిమాలో ఓ మీసాల పిల్ల, మరో పాటకు విజయ్ కొరియోగ్రఫీ చేశారు. గతంలో పుష్ప–2 సినిమాకు కూడా నృత్య దర్శకత్వం వహించినట్లు విజయ్ తెలిపారు. చిన్నప్పటి నుంచి అభిమానించే చిరంజీవికి కొరియోగ్రఫీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు.
పర్లాకిమిడిలో ‘పోలాకి’ సందడి


