సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
● బీజేపీ నాయకుడు కొండబాబు
● రాణిగుడఫారంలో సంక్రాంతి సంబరాలు
రాయగడ: మన తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడం అందరి బాధ్యతగా గుర్తించాలని బీజేపీ నాయకుడు యాల్ల కొండబాబు అన్నారు. స్థానిక రాణిగుడఫారం వద్ద గల మజ్జిగౌరి మండపం ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంబరాలను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనదన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మన పండుగలను భావితరాలు తెలుసుకునే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలుగు లోగిళ్లలో ఇంటింటా సంక్రాంతి సంబరాలు జరుగుతుంటాయన్నారు. అయితే అంతా ఒకే వేదికపై ఇటువంటి తరహా కార్యక్రమాలను, పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదిలాఉండగా సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో 20 మంది మహిళలు పాల్గొన్నారు. ఇందులో ప్రథమ బహుమతిని హారిక, ద్వితీయ బహుమతిని నిరుపమమహాపాత్రో, తృతీయ బహుమతిని రమ్యలు గెలుచుకొగా పోటీల్లొ పాల్గొన్న అందరికీ నిర్వాహకులు ప్రొత్సాహక బహుమతులను అందజేశారు. న్యాయనిర్ణేతలుగా కొళ్లూరి శేషసాయి, కె.పద్మావతి పట్నాయక్ వ్యవహరించారు. విజేతలకు ముఖ్యఅతిథిగా హాజరైన కొండబాబు బహుమతులను ప్రదానం చేశారు.
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి


