రహదారుల దిగ్బంధం
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
కొరాపుట్ : నబరంగ్‌పూర్ జిల్లాలో రైతుల సమస్యలపై మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. ప్రతిపక్ష బీజేడీ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు రహదారులు దిగ్బంధించారు. ఎక్కడికక్కడే ఆందోళనలు నిర్వహించారు. ఉదయం నుంచి జిల్లాతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు (మండీ)లలో రైతులు ధాన్యంతో రోజులు తరబడి పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మజ్జి చందాహండి సమితి కేంద్రంలో రాస్తారోకో చేశారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులో మధ్యాహ్నం వరకు ఆందోళన సాగింది. ఆందోళనకారులు ఎక్కడికక్కడ కాన్వాయ్‌కు మార్గం సుగమం చేశారు.ఈ కాన్వయ్ వెళ్తున్నప్పుడు అందులో ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బండారు ఘరణి మందిరం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలపై వాహనం వెళ్లడంతో కేకలు వేస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బ్రేక్‌లు వేస్తూ భయపెట్టాడు. దీంతో మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వాహనం ముందు నిలిచారు. బ్రేక్‌లు వేస్తూ బయపెట్టడం పట్ల మండిపడ్డారు. అక్కడ ఉన్న పోలీసులు కూడా భద్రతా దళ వాహన డ్రైవర్‌పై అసహనం వ్యక్తం చేసారు. అనంతరం ట్రాక్టర్ల తో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన రైతులు కలక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మని దహనం చేశారు. జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారీ, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రదాని, సుభాష్ గొండోలు, మాజీ జెడ్పీ ప్రెసిడెంట్ మంజులా మజ్జి తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతలకు మద్దతుగా బీజేడీ శ్రేణుల ఆందోళన
నబరంగ్‌పూర్ జిల్లాలో రాస్తారోకో
నిలిచిన వాహనాల రాకపోకలు
ప్రభుత్వ తీరుపై మండిపాటు
రహదారుల దిగ్బంధం
రహదారుల దిగ్బంధం
రహదారుల దిగ్బంధం
రహదారుల దిగ్బంధం
రహదారుల దిగ్బంధం


