భగవద్గీతను పఠనం చేయాలి
జయపురం: పవిత్ర భగవద్గీతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఇస్కాన్ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వీసీ మహేశ్వర చంద్ర నాయిక్ పర్యవేక్షణలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాయాపూర్ ధామ్ నుంచి వచ్చిన శ్రీపద వంశీ గోపీనాథ్ ప్రభు, మనోరమ గౌర దాస్, ఇస్కాన్ జయపురం శాఖ శ్యామానంద దాస్, ఘనశ్యామనంద దాస్‌లు పాల్గొని సనాతన పవిత్ర గ్రంథం భగవద్గీతలో పొందుపరచిన గీతా బోధనలు వాటి తాత్పర్యాలు విద్యార్థులకు బోధించారు. భగవద్గీత పఠనంతో మానసిక, ఆధ్యాత్మిక, శారీరక వికాసంతో పాటు ఉత్తమ గుణాలు గల మణిషిగా రూపు చెందగలరని వివరించారు. కార్యక్రమంలో భాగంగా +2, +3 విద్యార్థులు 250 మందికి భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరిసెట్టి రామకృష్ణ, దీనబందు అగర్వాల్, ఓంప్రకాశ్ హలన్, అశోక్ అగర్వాల్, రాజేష్ తోషినివాల, ప్రకాశ్ నాయిక్, పూర్ణచంద్ర పట్నాయక్ పాల్గొన్నారు.
భగవద్గీతను పఠనం చేయాలి


