బొబ్బిలి: పోక్సో కేసుల్లో ఇరుక్కుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్థానిక సబ్‌జైలును ఆమె సందర్శించి రిమాండ్ ఖైదీలతో మాట్లాడి సత్ప్రవర్తనపై తెలియజేశారు. న్యాయ సహాయం కావాల్సిన వారు ఏ విధంగా పొందవచ్చో వివరించారు. చెడు ఆలోచనల వల్ల ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, వాటికి దూరంగా ఉంటూ సమాజంలో మంచి పౌరులుగా ఎలా జీవించాలోనన్న విషయాలను తెలియపర్చి వారిలో పరివర్తన, చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. సబ్‌జైలర్ పాత్రో, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.