గార: కళింగపట్నంలోని మదీనాబాబా దర్గాలో చందనోత్సవం శుక్రవారం సాయంత్రం జరగనుంది. హిందూ–ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఈ దర్గా నిలుస్తోంది. 11 శతాబ్దంలో మక్కా నుంచి మదీనాబాబా గుర్రంపై ఇక్కడికి విచ్చేశాని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఇక్కడే సమాధి అయ్యారని కథనం. రంజాన్ నెల ప్రారంభమైన 16వ రోజున బాబా సమాధిపైనున్న చందనం తీసి, కొత్త చందనం పూస్తారు. బాబాను దర్శనం చేసుకుంటే కష్టాలు తీరుతాయని, బంగారం వస్తువులతో పాటు డాక్యుమెంట్లు వంటివి పోగొట్టుకొని, దొరకని సమయంలో బాబాను తలుచుకొని ప్రసాదాన్ని పంచిపెడితే వెంటనే దొరుకుతాయని భక్తుల నమ్మకం. ముస్లింలుతో పాటు హిందువులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు.


