హిరమండలం: అలికాం–బత్తిలి రహదారిపై ఎల్‌ఎన్‌పేట మండలం తురకపేట జంక్షన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపారావు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన ఎస్.పాపారావు సోదరుడు సూర్యనారాయణతో కలిసి ఎల్‌ఎన్‌పేట మండలంలో శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వీరి బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాపారావుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సరుబుజ్జిలి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ హైమావతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


