మళ్లీ వస్తా.. విద్యార్థులతో మాట్లాడతా.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తా.. విద్యార్థులతో మాట్లాడతా..

Aug 11 2023 12:30 AM | Updated on Aug 11 2023 7:39 AM

ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ అడ్డయ్య, సిబ్బందితో ఆర్‌.నారాయణమూర్తి  - Sakshi

ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ అడ్డయ్య, సిబ్బందితో ఆర్‌.నారాయణమూర్తి

ఎచ్చెర్ల క్యాంపస్‌: ‘యూనివర్సిటీ’ సినిమా ప్రమోష న్‌ వర్కులో భాగంగా సీనియర్‌ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి గురువారం ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్‌లో ఈ సినిమా నిర్మించారు. వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్యను కలిసి విద్యార్థులతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు.

అయితే ప్రస్తుతం సెమిస్టర్‌ పరీక్షలు జరగుతున్నాయని, మరోసారి రావాలని కోరారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ యూనివర్సిటీ సినిమా ను ఆదరించాలని కోరారు. అక్టోబర్‌ 4న శ్రీకాకుళం పట్టణంలో యూనివర్సిటీ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా ప్రమాణాలు, రాజకీయ జోక్యం, విద్యార్థుల సమస్యలను సినిమా లో ప్రస్తావించామన్నారు. తప్పకుండా విద్యార్థుల ను ఆకట్టుకుంటుందన్నారు. మరోసారి విశ్వవిద్యాలయం సందర్శించి విద్యార్థులతో మాట్లాడతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement