జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా

May 14 2023 12:22 AM | Updated on May 15 2023 10:23 AM

ఓజేయూ సభ్యులకు బీమా పాలసీలు అందిస్తున్న రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు  - Sakshi

ఓజేయూ సభ్యులకు బీమా పాలసీలు అందిస్తున్న రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

జర్నలిస్ట్‌ యూనియన్‌(ఓజేయూ)లో సభ్యులందరికీ రూ.10 లక్షల బీమా పథకం

జయపురం: ఒడిశా జర్నలిస్ట్‌ యూనియన్‌(ఓజేయూ)లో సభ్యులందరికీ రూ.10 లక్షల బీమా పథకం అమలు చేస్తున్నట్లు యూనియన్‌ రాష్ట్ర సాధారణ కార్యదర్శి కె.శ్రీనివాసరావు వెల్లడించారు. జయపురం సబ్‌ డివిజన్‌ బొరిగుమ్మలో ఒడిశా జర్నలిస్ట్‌ యూనియన్‌ కొరాపుట్‌ జిల్లాశాఖ సభ్యుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించడంతో పాటు రూ.10 లక్షల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే పలువురు సభ్యులకు బీమా పాలసీ పత్రాలను అందజేశారు. సమావేశంలో వివిధ సమితులకు చెందని యూనియన్‌ సభ్యులు, కొరాపుట్‌ జిల్లాశాఖ అధ్యక్షుడు జయసింగ్‌ పాఢి, ఉపాధ్యక్షుడు గౌరీశంకర మహాపాత్రొ సునామ్‌ హంతాల్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్రాంతి బెహరా, శ్యామ ఖిళో, సునీల్‌ షొడంగి, శుభనారాయణ మహంతి, కృష్ణ గొలారి, సుశాంతకుమార్‌ పండా, సుదర్శన ప్రధాన్‌, రామచంద్ర నాయిక్‌, బొరిగుమ్మ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement