జల దిగ్బంధంలో కౌంటింగ్‌ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

జల దిగ్బంధంలో కౌంటింగ్‌ కేంద్రం

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌పై మురుసు తుపాను ప్రభావం తీవ్రంగా చూపింది. విజయవాడ నగరంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కౌంటింగ్‌ నిర్వహించే ఆంధ్ర లయోల కళాశాల ప్రాంగణం జలమయంగా మారింది. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పలు టెంట్లు కూలిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా జోరు వర్షం కురవడంతో కౌంటింగ్‌ విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులతో పాటు, రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లు, అభ్య ర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం జోరు వర్షంలో తడిసి వచ్చిన వారు, కౌంటింగ్‌ జాప్యం కావడంతో సాయంత్రం వరకూ వర్షంలో తడుస్తూ, ఈదురు గాలులతో చలికి వణుకుతూ అలాగే గడిపారు.

అడుగులోతు నీళ్లు

లయోల కళాశాల ప్రాంగణంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లుపై అడుగులోతు నీరు నిలిచింది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ కౌంటింగ్‌ నిర్వహించిన ఇండోర్‌ స్టేడియానికి వెళ్లేందుకు ఏజెంట్లు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 200 మీటర్లు అడుగులోతు నీళ్లలో వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు జోరు వర్షం , మరో వైపు రోడ్లుపై నీరు నిలవడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. కౌంటింగ్‌ కేంద్రాలకు సమీపంలో టాయిలెట్లు లేక మహిళా సిబ్బంది వర్షంలో దూరంగా ఉన్న ప్రాంతాలకు వర్షంలో తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement