ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు సోమవారంతో పూర్తైంది. మూడో విడత జరిగిన హుండీ కానుకల లెక్కింపులో రూ.2.45 కోట్ల మేర ఆదాయం లభించిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడు విడతల్లో రూ.11.59 కోట్ల మేర ఆదాయం అమ్మవారికి సమకూరింది.
మూడో విడతలో రూ.2,45,52,904 నగదు, 115 గ్రాముల బంగారం, 3.590 కిలోల వెండి లభించాయి. విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభించింది. దసరా ఉత్సవాల్లో.. రద్దయిన రూ.2 వేల నోట్లు 17 వచ్చాయి.


