ముగిసిన విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్‌లో విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల ముగింపు వేడుకలు సోమవారం జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా మాట్లాడుతూ.. ప్రజా సేవలో సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే డివిజన్‌లో విజిలెన్స్‌ వారోత్సవాల ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా పరిపాలనలో అప్రమత్తత ప్రాముఖ్యత, నైతిక ప్రవర్తన, అవినీతి నివారణలో ఉద్యోగుల సామూహిక బాధ్యతను వివరిస్తూ దక్షిణ కోస్తా రైల్వే డెప్యూటీ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ వెంకట కారుణ్య పీపీటీ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రైల్వే ఉద్యోగులు, జాక్‌ అండ్‌ జిల్‌ స్కూల్‌, కేంద్రీయ విద్యాలయం, ఐకాన్‌ స్కూల్‌ విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement