జనసేన మూకల అరాచకం | - | Sakshi
Sakshi News home page

జనసేన మూకల అరాచకం

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

కృష్ణలంకలోని మాజీ కార్పొరేటర్‌ ఇంటిపై అర్ధరాత్రి దాడి

మద్యం మత్తులో పది మంది దాడికి పాల్పడిన వైనం

బాధిత కుటుంబానికి దేవినేని అవినాష్‌ పరామర్శ

లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంలో జనసేన నేతలు దాడులకు తెగబడ్డారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పది మంది జనసేనకు చెందిన వారు మద్యం మత్తులో వైఎస్సార్‌ సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్‌, బీసీ నాయకుడు పల్లెం రవి ఇంటిపై దాడికి వెళ్లారు. ఆయన ఉంటున్న రెండో అంతస్తుకు వెళ్లి తలుపులు బాదుతూ అరాచకం సృష్టించారు. ఆ సమయంలో రవి లేక పోవడంతో బయటకు వచ్చిన అతని భార్య, పిల్లలను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురిచేశారు. అడ్డుకు నేందుకు వచ్చిన స్థానిక వ్యక్తిపైన దాడికి యత్నించారు. ఈ దృశ్యాలన్నీ ఆ ఇంటికి అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఏంట్రా రెచ్చిపోతున్నావ్‌ అంటూ ఫోన్‌లో బెదిరింపులు

ఆదివారం పోలింగ్‌ ముగిశాక అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న 27వ డివిజన్‌ జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థి తరఫు బంధువులు మాజీ కార్పొరేటర్‌ పల్లెం రవికి ఫోన్‌ చేశారు. ‘బాగా ప్రచారం చేశారు. మీరే గెలుస్తారులే’ అంటూ హేళనగా మాట్లాడుతూ దుర్బాషలాడారు. పల్లెం రవి స్పందించి పోలింగ్‌ ముగిసింది, మరో రోజులో ఫలితాలు వస్తాయిగా అని బదులివ్వగా, ఎంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావ్‌ అంటూ రెచ్చిపోయారు. బెదిరింపులకు భయపడేది లేదని రవి దీటుగా సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన జనసేనకు చెందిన 10 మంది మద్యం మత్తులో అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆ కుటుబాన్ని పరామర్శించారు. జనసేన నేతలు దాడులు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. భయపడ వద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలని, పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అర్ధరాత్రి వేళ తన భర్త లేని సమయంలో పలువురు మద్యం మత్తులో ఇంటికి వచ్చి తలుపులు బాదుతూ భయభ్రాంతులకు గురి చేశా రని రవి భార్య తేజేశ్వరి వాపోయారు. జనసేన నేత జయ, అతని అనుచరులు దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. జిలానీ అనే వ్యక్తి బూతులు తిట్టా డని, మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన భార్య, పిల్లలను భయపెట్టారని మాజీ కార్పొరేటర్‌ రవి పేర్కొన్నారు. బీసీ కులం అని తనను కొట్టడానికి యత్నించారని, దాడికి తెగ బడిన ప్రతి ఒక్కరిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement