అర్నబ్ తుపాను ప్రభావం నుంచి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఇంకా తేరుకోలేదు. భారీ వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీల్లోని అంతర్గత రోడ్లు పూర్తిగా నీటమునిగాయి. ప్రధాన రహదారిలో నిలిచిన నీరు తొలిగినా కాలనీల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కోర్టు రోడ్డు ఇంకా నీట మునిగే ఉంది. నీటిలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
– మచిలీపట్నం టౌన్


