వాగును ఆక్రమిస్తున్న ‘రియల్‌’ వ్యాపారులు! | - | Sakshi
Sakshi News home page

వాగును ఆక్రమిస్తున్న ‘రియల్‌’ వ్యాపారులు!

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

వాగును ఆక్రమిస్తున్న ‘రియల్‌’ వ్యాపారులు!

నున్న(విజయవాడరూరల్‌): నున్నలో కొండవాగు నుంచి ఎర్ర చెరువులోకి ప్రవహించే వాగునీరు రాకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాళ్లతో పూడ్చుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నున్న హృదయనగర్‌ కాలనీ సమీపంలో వంతెనకు ఉత్తరం వైపు నుంచి వాగు సమీపంలో భూములను కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశారని, ఆ వాగును పూడ్చుతున్నారనే విషయం తెలిసి రైతులు అక్కడకు వెళ్ళి అభ్యంతరం వ్యక్తం చేసి పూడ్చొద్దన్నారు. వాగును పూడ్చటంతో ఎర్ర చెరువుకు వాగునీరు వచ్చే అవకాశం ఉండదని, చెరువు ఆయకట్టు పరిధిలో వ్యవసాయ పంట పొలాలు పండే పరిస్ధితి వుండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు వాగు ఆక్రమణలను తొలగించాలని గ్రామంలోని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement