మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల చెస్ చాంపియన్‌షిప్–2026 పోటీలు, కృష్ణా యూనివర్సిటీ జట్టులో సభ్యుల ఎంపికను ఈనెల 26వ తేదీ సోమవారం విజయవాడ గాంధీనగర్‌లోని తమ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నామని శారద కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగేశ్వరశర్మ చెప్పారు. స్థానిక గాంధీనగర్‌లోని కళాశాల ఆవరణలో చెస్ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన పత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరశర్మ మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ పోటీలతో పాటుగా యూనివర్సిటీ జట్టు ఎంపికలో పాల్గొనవచ్చని తెలిపారు. యూనివర్సిటీ జట్టు ఎంపికలకు హాజరయ్యే వారు కళాశాల నుంచి గుర్తింపు ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ ఫొటో, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, ఇంటర్, పదో తరగతి సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్‌తో అటెస్ట్ చేయించి తీసుకురావాలని వివరించారు. ఇతర వివరాలకు తమ కళాశాలలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో సిబ్బందిని సంప్రదించాలని కోరారు. కళాశాల కార్యదర్శి కుందా రామ నారాయణ, ప్రసాదరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.


