క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకోవాలి

Oct 24 2026 9:56 AM | Updated on Oct 24 2026 9:56 AM

క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకోవాలి

ఆక్టోపస్‌ ఐజీ శ్రీకాంత్‌ సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌లో ఆకట్టుకున్న ఆక్టోపస్‌ ప్రదర్శన

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రమశిక్షణ, దేశభక్తిని విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని ఆర్గనైజేషన్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ (ఆక్టోపస్‌) విభాగం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీకాంత్‌ అన్నారు. స్థానిక మొగల్రాజపురంలోని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆక్టోపస్‌ ఆధ్వర్యంలో ఓపెన్‌ ఎగ్జిబిషన్‌ జరిగింది. ఐజీ శ్రీకాంత్‌ మాట్లాడతూ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఆక్టోపస్‌ విభాగం పాత్రపై స్కూల్‌ విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆక్టోపస్‌ (ఆపరేషన్స్‌) ఎస్పీ శశికాంత్‌, అడ్మిన్‌ ఎస్పీ లక్ష్మీపతి, ఐపీఎస్‌ సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షుడు వి.నాగభూషణరావు, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, జాయింట్‌ సెక్రటరీ సూర్రెడ్డి విష్ణు, గవర్నింగ్‌ బాడీ సభ్యుడు అరుణ్‌ కుమార్‌, సిద్ధార్థ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎం.సీతారామయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.రోజ్‌ మేరీ, ప్రైమరీ విభాగం ప్రిన్సిపాల్‌ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement