పేలుడు పదార్థాలు గుర్తించడంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషరేట్‌లో తొమ్మిదేళ్లు సేవలు అందించిన బెల్జియం మెలనోయిస్ జాతికి చెందిన స్నీపర్ డాగ్ లూసీ అనారోగ్యంలో మంగళవారం మరణించింది. లూసీ మృతిపై పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు శ్రద్ధాంజలి ఘటించి, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు సీఎస్‌డబ్ల్యూ ఏసీపీ చిరంజీవి, ఆర్‌ఐలు అంకమరావు, సంపంగి రావు, సుధాకరరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు పోలీసు డాగ్ లూసీ పార్థీవ దేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు.
– లబ్బీపేట(విజయవాడతూర్పు)


