త్రిపురనేని దేశభక్తి గీతాలతో ఉత్తేజం | - | Sakshi
Sakshi News home page

త్రిపురనేని దేశభక్తి గీతాలతో ఉత్తేజం

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశభక్తి గీతాలతో త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రజలను ఉత్తేజపరిచారని సినీనటుడు త్రిపురనేని గోపీచంద్‌ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో ఉన్న స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘసంస్కర్త, హేతువాద రచయిత, న్యాయవాది త్రిపురనేని రామస్వామి చౌదరి విగ్రహాన్ని ఆయన మనుమడు, సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్‌ శుక్రవారం సందర్శించి నివాళులు అర్పించారు. తాత రామస్వామి విగ్రహానికి శాలువా కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామస్వామి కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని అంగలూరు గ్రామంలో జన్మించినా తెనాలి పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌గా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసిందని చెప్పారు. సూతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతుండేదని తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన రామస్వామి, నాస్తికుడిగా అనేక పుస్తకాలు రచించారన్నారు. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాధనంగా త్రిపురనేని ఎంచుకున్నారని పేర్కొన్నారు. రచయితలు, నాస్తికులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సుంకర నాగభూషణం, గోళ్ల నారాయణరావు, మోతుకూరి అరుణ్‌కుమార్‌, బండ్ల మాధవరావు, శివస్రాద్‌, గుత్తికొండ సుబ్బారావు, గుమ్మా సాంబశివరావు, వెన్న వల్లభరావు, అశోక్‌బాబు, పరుచూరి అజయ్‌ కుమార్‌, పిచ్చయ్య, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement