కలెక్టర్‌ లక్ష్మీశ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ లక్ష్మీశ

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

మహాత్మా గాంధీ ఆశయాలు ఆదర్శప్రాయం

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సమానత్వం, స్వచ్ఛత వంటి ఉన్నతమైన ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం మరింత బలోపేతమవుతాయన్నారు. స్వాతంత్య్ర సాధనకు మహాత్మా గాంధీ అనుసరించిన సత్యా గ్రహం, అహింసా మార్గాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్య్ర ఉద్యమంలో చైతన్యం నింపడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇతరులపై గౌరవం, సహనం, మానవతా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా గాంధీజీ కలలుగన్న సమాజ నిర్మాణానికి దోహదపడగలరని పేర్కొన్నారు. గాంధీజీ స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యమిచ్చారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. గాంధీ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement